తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 22 April 2011

శంకరాభ(పూ)రణం : దద్దమ్మలకీ జగత్తు ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 -01 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


                          సమస్య : దద్దమ్మలకీ జగత్తు దండుగ  కాదా ?



              కం:  సుద్దులు విద్దెలు నేర్వక,
                  పెద్దలపై ప్రేమలేక, ప్రేలుచు దిరిగే
                  యెద్దులు,పెడ బుద్ధులు గల 
                  దద్దమ్మలకీ జగత్తు, దండుగ కాదా?


2 comments:

Anonymous said...

హనుమచ్చాస్త్రి గారు....రోజు కొకటి చొప్పున మీరు ఉంచుతున్న పద్యములు చాల చక్కగా ఉంటున్నవి. మాబోంట్లకు అంత రచనా సామర్ధ్యము రాదులెండి. ఏదొ కొంత సాహిత్యాభిమానము తప్పితే...g.s.sastry

గోలి హనుమచ్చాస్త్రి said...

జీ యస్ గారూ!తరచు బ్లాగును వీక్షించి అభిప్రాయములు తెలుపుచున్న మీ సాహిత్యాభిమానానికి అభినందనలు.మీ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.