తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday 30 March 2011

దత్తపది : రారా, సారా, పోరా, తేరా.

గతములో ఆకాశవాణి సరస వినోదిని కార్యక్రమమున ఇచ్చిన దత్తపదికి నా పూరణ. (రామాయణార్థంలో)


  దత్తపది - రారా,సారా,పోరా,తేరా.
(భారతార్థంలో)  

శా.  రారాజా!విను నాదు మాటలిక రాజ్యమ్ము రక్షింపగా !
       పోరామ్మును జేయకున్న సుఖముల్ బొందేరుగా!నా మన 
      స్సారామ్మును జెందుచుండెనిక మీ సంధిన్ గుదుర్పంగ!పో 
      తే, రాదీ తరుణమ్ము పంచు సగమున్!ధీశాలి కౌంతేయుకున్!         
 

2 comments:

Anonymous said...

Dear SAstry garu, pi rendu purnalu okati bharatamu, marokati ramayanamu ardham lo alarinchinavi. Datta padula puranamulu smasyala puranamula knate chala bagaunnvi anipinchai. makosam mari konni dattapadulanu pooriste chudalani vundi. like sachin, dhoni, yuvaraju,virendra (sehvag ). srinivas. hyd

గోలి హనుమచ్చాస్త్రి said...

శ్రీనివాస్ గారూ!విశ్లేషించి అభిప్రాయమును తెలియజేసినందులకు ధన్యవాదములు.మీసూచనలను పాటించడానికి ప్రయత్నిస్తాను.