గతములో ఆకాశవాణి సరసవినోదిని కార్యక్రమమున ఇచ్చిన దత్తపది కి చేసిన పూరణ.
దత్తపది : రవి, గురు, కుజ, బుధ... కందము, రామాయణార్థం లో
కం. గురు సమ్మతమును గైకొని
చురుకుగ రవి కుల తిలకుడు సూత్రము లాగన్
హర కార్ముకంబు ధబ్బున
విరుగన్ రాముకు జనకజ వేసెను మాలన్.
4 comments:
శాస్త్రి గారూ !
మీ బ్లాగు బాగుగ యున్నది !
దినదిన ప్రవర్థమాన మవ్వాలని కోరుకొంటున్నా !
వసంత కిశోర్ గారికి స్వాగతం.
కిశోర్ గారూ! ధన్యవాదములు.
మీ వీక్షణములకై సదా ప్రతీక్షించుచుంటాను.తరచూ బ్లాగును వీక్షించి మీ అమూల్యములైన అభిప్రాయములు తెలుపవలసినదిగా కోరుచున్నాను.
దత్తపదులకు మీ పద్యాలు అద్భుతంగా ఉన్నాయి శాస్త్రి గారూ.
మిస్సన్న గారూ ! స్వాగతం. నా సమస్యల 'పూ' రణాన్ని వీక్షించినందులకు ధన్యవాదములు.తరచు వీక్షించి సమీక్షించవలసినదిగా కోరుచున్నాను.
Post a Comment